: తమిళనాడులో ఆకాశం నుంచి కింద పడ్డ వింత వస్తువు


తమిళనాడులో ఆకాశం నుంచి బంతి ఆకారంలో ఉన్న ఒక వింత వస్తువు కిందపడింది. ఈ వస్తువును చూసి భయాందోళనలకు గురైన అక్కడి ప్రజలు పరుగులు తీశారు. కరూర్ జిల్లా గౌండపాళయంలోని కుళందై స్వామి అనే రైతు ఇంటి సమీపంలో నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సుమారు పదికిలోల బరువున్న ఆ వింత వస్తువులో గుండ్రటి ఇనుప రేకు కనిపించింది. భారీ శబ్దంతో పైనుంచి కిందపడిన ఈ వస్తువు దగ్గరకు వెళ్లటానికి ప్రజలు భయపడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖల సిబ్బందితో పాటు బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి వెళ్లారు. ఈ వింత వస్తువు గురించి తెలుసుకునేందుకు గాను చెన్నయ్ నుంచి రక్షణ విభాగానికి చెందిన అధికారులను పిలిపించారు.

  • Loading...

More Telugu News