: మీకే కాదు.. చాలామంది మంత్రులకు కూడా సర్దార్ పటేల్ గురించి తెలియదు: వెంకయ్యనాయుడు


కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన స్వర్ణభారతి ట్రస్టు లో నిర్వహించిన జాతీయ ఐక్యతా వారోత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ అవసరం. శిక్షణతోనే నైపుణ్యాలు మెరుగవుతాయి. సమాజంలో సామరస్యం ఉండాలంటే కొన్ని పద్ధతులు, వ్యవస్థ ఉండాలి. వాటిని మనం గౌరవించుకోవాలి. రాజ్యాంగం వాటిని మనకు ప్రసాదించింది .. ప్రజాస్వామ్య సూత్రం ఉద్దేశం అదే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. నవతరానికి, యువతరానికి సర్దార్ పటేల్ అంటే ఎవరో తెలియదు. ఆయన జీవితం గురించి తెలియదు. మీకే కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉండే చాలామంది మంత్రులకు కూడా సర్దార్ పటేల్ గురించి తెలియదు’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News