: ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారందరినీ హ‌త‌మార్చాల్సిందే!: ఉత్తరప్రదేశ్‌ మంత్రి అజంఖాన్‌


కేంద్ర‌కారాగారం నుంచి త‌ప్పించుకున్న‌ సిమీ ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు హ‌త‌మార్చిన అంశంపై ఎస్పీ సీనియర్‌ నేత, ఉత్తరప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజంఖాన్ ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారందరినీ హ‌త‌మార్చాల్సిందేన‌ని పేర్కొన్నారు. ఉగ్ర‌వాదులు సిమీ ఉగ్రవాదులా.. లేక వేరే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారా? అన్న అంశాన్ని కూడా చూడ‌కూడ‌ద‌ని అన్నారు. మ‌రోవైపు ఆయ‌న రాహుల్ గాంధీపై కూడా విమర్శ‌లు గుప్పించారు. ఓఆర్ఓపీ అమ‌లు చేయాలంటూ ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రామ్ కిషన్‌ గ్రేవాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యానే సంద‌ర్శించార‌ని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News