: మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారు నాకేమీ చెప్పలేదు: సుమంత్
‘మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) నాకేమీ చెప్పలేదు’ అని ప్రముఖ నటుడు సుమంత్ అన్నాడు. ‘నరుడా డోనరుడా’ చిత్రం రేపు విడుదల కానున్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సుమంత్ సమాధానమిస్తూ, ‘తాత గారికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయన చనిపోయే వరకూ దాదాపు ఆరు నెలల పాటు ఆయనతోనే గడిపాను. ఆ సమయంలో తాతయ్యను ఆనందంగా ఉంచాలని మా కుటుంబ సభ్యులందరూ అనుకున్నారు. అదేవిధంగా, తాత గారిని ఆనందంగా ఉండేలా చూశాము. నా వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి ఆయన వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదు. నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని కూడా తాతగారు నాకేమీ చెప్పలేదు’ అన్నాడు. కాగా, గతంలో కీర్తిరెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అనతి కాలంలోనే వారు విడిపోవడం జరిగింది.