: 14 నెలల చిన్నారి శరీరంలోకి దూసుకెళ్లిన పాకిస్థాన్ బుల్లెట్లు


సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతూ భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది పాకిస్థాన్. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 14 నెలల పరి అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆ చిన్నారి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. దీంతో, ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్ లోని సాంబ సెక్టార్ లో జరిగింది. వెంటనే ఆమెను సాంబ సెక్టార్ ఆసుపత్రికి, ఆ తర్వాత జమ్ము ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని... 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు చెప్పారు.

  • Loading...

More Telugu News