: రణ్ బీర్ కపూర్ ని మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ చితకబాదాడట!


ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనను మోకాళ్లపై కూర్చోబెట్టి చితకబాదాడని నాటి విషయాలను బాలీవుడ్ యువహీరో రణ్ బీర్ కపూర్ గుర్తు చేసుకున్నాడు. రణ్ బీర్ కపూర్ మొదట్లో దర్శకుడు కావాలనుకున్నాడట. ఈ నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అప్పుడు జరిగిన సంఘటనను రణ్ బీర్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. వర్క్ విషయమై భన్సాలీ ఒకసారి తనను మోకాళ్లపై కూర్చోబెట్టి చితకబాదారని, ఈ బాధ పడలేక సెట్ నుంచి వెళ్లిపోవాలనుకున్నానని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. అయితే, వర్క్ విషయమై భన్సాలీ తనను ఎంత టార్చర్ పెట్టినప్పటికీ, ఒక్కవిషయం మాత్రం నిజమంటున్నాడు. తనకు సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆయనేని, సినిమా పాఠాలను దగ్గరుండి మరీ నేర్పించారని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం హిట్ ను ఎంజాయ్ చేస్తున్న రణ్ బీర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News