: దానవాయిపేటలో ఉద్రిక్త వాతావరణం... భారీగా పోలీసుల మోహరింపు


తూర్పుగోదావ‌రి జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేటలో ఈ రోజు సీపీఎం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్క‌డ‌ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దివీస్ ఫార్మాకి వ్యతిరేకంగా దివీస్ వ్యతిరేక పోరాట క‌మిటీతో క‌లిసి సీపీఎం నేత‌లు ఈ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు. సీపీఎం శ్రేణులు స‌భ నిర్వ‌హించి తీరుతామ‌ని చెప్ప‌డంతో దానవాయిపేటలో పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతం వైపుకు సీపీఎం నేత‌లు రాకుండా అడ్డుకోవ‌డానికి కాకినాడ‌, తుని మ‌ధ్యలో ప‌లు ప్రాంతాల్లో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

  • Loading...

More Telugu News