: మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్ సర్కార్
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కోసం పోరాడుతూ విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబానికి ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రోజు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. అంతేగాక, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ రోజు హర్యానాలోని భివాండీలో జరుగుతున్న రామ్ కిషన్ గ్రేవాల్ అంత్యక్రియలకు కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. కాసేపట్లో ఆయన కిషన్ గ్రేవాల్ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హర్యానా ప్రభుత్వం కూడా కిషన్ గ్రేవాల్ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.