: మొరాయించిన వాహనం.. ‘వికాస్ రథయాత్ర’ను ప్రారంభించిన కొద్దిసేపటికే నిలిపివేసిన అఖిలేశ్ యాదవ్
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ రోజు వికాస్ రథయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఎంతో మంది కార్యకర్తలు, ప్రజల మధ్య ప్రారంభమయిన రథయాత్ర కొద్ది సేపటికే తాత్కాలికంగా ఆగిపోయింది. అన్ని హైటెక్ హంగులతో తయారు చేసిన రథయాత్ర వాహనంలో సాంకేతిక లోపం తలెత్తింది. వాహనంలో అఖిలేష్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే కిలో మీటరు ప్రయాణించగానే వాహనంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో తాత్కాలికంగా వికాస్ రథయాత్రను నిలిపివేస్తున్నట్లు అఖిలేశ్ తెలిపారు.