: ట్విట్టర్ కు మరో ఇబ్బంది.. ట్విట్టర్ ఇండియా ఎండీ పర్మిందర్ సింగ్ రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు తాజాగా మరో షాక్ తగిలింది. ట్విట్టర్ ఇండియా (ఆగ్నేయ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం) ఎండీ పదవికి పర్మిందర్ సింగ్ రాజీనామా చేశారు. గత మూడేళ్లగా ఈ పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరో నెల రోజులపాటే ట్విట్టర్ లో కొనసాగనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో గూగుల్, యాపిల్, ఐబీఎం వంటి కంపెనీల్లో పర్మీందర్ పని చేశారు. ట్విట్టర్ భవిష్యత్ పై హైప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్స్ లో అనిశ్చితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే, సీనియర్లంతా సంస్థ నుంచి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇటీవలే ఇండియా హెడ్ రిషి జైట్లీ కూడా రిజైన్ చేశారు. సంస్థ నుంచి ఉద్యోగుల తొలగింపు, సంస్థను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలాంటి అంశాలు ట్విట్టర్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
An update. After leading Twitter in Asia's most exciting markets (India/SEA/MENA) for 3 yrs, time to move on to new passions #BeenAPrivilege
— Parminder Singh (@parrysingh) November 3, 2016