: బంద్ కు సంఘీభావం.. చర్లపల్లి జైల్లో మావోయిస్టు ఖైదీల నిరాహార దీక్ష
హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో ఈ రోజు మావోయిస్టులు బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్ కు సంఘీభావంగా వీరు ఈ ఉదయం నుంచి దీక్షను చేపట్టారు. ఉదయం నుంచి అన్నపానీయాలు ముట్టుకోకుండా దీక్ష చేస్తున్నారు. మరోవైపు, బంద్ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. అనుమానిత వ్యక్తులను, వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.