: ఆదిలోనే హంసపాదు... అఖిలేష్ వికాస్ రథయాత్రలో కొట్టుకున్న కార్యకర్తలు
యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఉదయం ప్రారంభించిన వికాస్ రథయాత్రలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ ఉదయం రథయాత్ర లక్నోలో ప్రారంభం కాగా, యాత్రకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అఖిలేష్ వర్గం, శివపాల్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. పలుమార్లు లాఠీచార్జ్ చేసిన పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదరు చేశారు. దీన్ని చాలా చిన్న ఘటనగా అఖిలేష్ అభివర్ణించారు.