: ఆస్ట్రేలియా ఉత్తమ బిజినెస్ విమెన్‌గా భారత సంతతి ‘చాయ్వాలీ’
భారత సంతతి చాయ్వాలీకి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. వివిధ వనమూలికల మిశ్రమంతో ఆయుర్వేద టీ తయారు చేస్తున్న 26 ఏళ్ల ఉపమా విర్దీ ఈ ఏడాది ఆస్ట్రేలియా ఉత్తమ బిజినెస్ విమెన్‌గా ఎంపికైంది. స్వతహాగా న్యాయవాది అయిన ఉపమా తన తాత నుంచి ఆయుర్వేద టీని తయారుచేయడం నేర్చుకుంది. టీ తయారీలో ఆస్ట్రేలియన్లకు శిక్షణ కూడా ఇస్తున్న ఆమె ఆన్లైన్ ద్వారానూ టీ విక్రయిస్తుండడం విశేషం. ఆయుర్వేద టీ తయారీని లాభదాయక వ్యాపారంగా మార్చిన ఉపమాను ఈ అవార్డుకు ఎంపికచేశారు. ఇండియన్ ఆస్ట్రేలియన్ బిజినెస్ కమ్యూనిటీలో విర్దీని ఘనంగా సత్కరించి అవార్డును ప్రదానం చేశారు. చండీగఢ్‌కు చెందిన విర్దీ పూర్వీకులు బ్రిటిష్ కాలంలోనే ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు.