: కుట్రతోనే నా కొడుకును చంపేశారు.. అతడు ఉగ్రవాది కాదు, అమరుడు..: సిమీ ఉగ్రవాది తల్లి


మధ్యప్రదేశ్ పోలీసులు తన కొడుకును అకారణంగా చంపేశారని ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిమీ ఉగ్రవాది ముజీబ్ జమీల్ షేక్(30) తల్లి ముంతాజ్ ఆరోపించారు. కుట్రలో భాగంగానే తన కొడుకును ఎన్‌కౌంటర్ చేశారని పేర్కొన్నారు. అది ‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌’ అని ఆరోపించారు. 2008లో అహ్మదాబాద్‌లో జరిగిన పేలుళ్ల కేసులో ముజీబ్ నిందితుడు. ఆ ఘటనలో 56 మంది మృతి చెందారు. భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న ముజీబ్ సహా మరో ఏడుగురు ఉగ్రవాదులు సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. తమ అధీనంలో ఉన్న 8 మందిని పోలీసులు ఓ వాహనంలో ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకొచ్చినట్టు కొందరు తనతో చెప్పారని ముంతాజ్ పేర్కొన్నారు. వారు ఉగ్రవాదులని పోలీసులు స్థానికులతో చెప్పారని తెలిపారు. యువకులు సాయం కోసం అరుస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారని భోపాల్ ప్రజలు తనతో చెప్పినట్టు ఆమె వివరించారు. ముజీబ్ దోషిగా తేలలేదు కాబట్టి అతడిని ఉగ్రవాదిగా చిత్రీకరించొద్దని ముంతాజ్ మీడియాను అభ్యర్థించారు. తన కొడుకు ముజాహిదీన్ అని, అమరుడని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News