: రిటైర్మెంట్ యోచనలో సైనా.. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్య


స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ యోచనలో ఉందా? ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రియో ఒలింపిక్స్ నుంచి మోకాలి గాయంతో లీగ్ దశలోనే నిష్కృమించిన సైనా ఈ నెల 15 నుంచి జరగనున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ లక్ష్యాలను తానేమీ నిర్దేశించుకోలేదని తెలిపింది. చాలామంది తన కెరీర్ ముగిసిందని చెబుతున్నారని, గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే తనకూ అలాగే అనిపిస్తోందని పేర్కొంది. అయితే మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నానని, అయితే నా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారని పేర్కొంది. వారు అలా అనుకోవడం తనకు సంతోషమేనని తెలిపింది. ఇక నుంచి వారు తన గురించి ఆలోచించడం మానేస్తారేమోనని పేర్కొంది.

  • Loading...

More Telugu News