: ఒక ముఖ్యమంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడమా?: సీఎం మమతాబెనర్జీ విస్మయం


వన్ ర్యాంక్- వన్ పెన్షన్ అమలు చేయాలంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ సైనికోద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో అసలు ఏం జరుగుతోందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవడం ఎన్నడూ జరగలేదని ఆ ట్వీట్ లో మమత పేర్కొన్నారు. అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ఆమె ఖండించారు. కాగా, కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి తర్వాత ఆయన్ని విడుదల చేశారు.

  • Loading...

More Telugu News