: మద్యంలో నీళ్లు కలిపి అమ్ముతున్న రెండు వైన్ షాపుల సీజ్
మద్యంలో నీళ్లు కలిపి అమ్ముతున్న రెండు వైన్ షాపులను సీజ్ చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. కల్తీ మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రవి వైన్స్, మహారాజా వైన్స్ దుకాణాల్లో శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా మద్యంలో నీరు కలిపి అమ్ముతున్నట్లు తేలింది. దీంతో, రెండు దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సైదుల్లా మాట్లాడుతూ, కల్తీ మద్యం అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐదు మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. కల్తీ మద్యం విక్రయిస్తున్న ఆ రెండు దుకాణాల యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.