: ఆర్ఎంఎల్ ఆసుపత్రి వద్ద కేజ్రీవాల్ ను అడ్డుకున్న పోలీసులు
వన్ ర్యాంక్- వన్ పెన్షన్ విషయమై ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ జవాన్ రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటనపై ఆప్ నేతలు మండిపడుతున్నారు.