: రాహుల్ గాంధీ, మనీష్ సిసోడియాలను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కోసం పోరాడుతున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ (70) కేంద్ర సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ జంతర్‌మంతర్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వేర్వేరుగా వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి రాజకీయనాయకులు వచ్చి ఆటంకాలు సృష్టించకూడదని పోలీసులు కోరారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఓపీని కేంద్రం సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.