: బీటెక్ పేపర్లో ‘లోకేష్ బ్యాంక్’ ప్రశ్నలడగడం పొరపాటే: జేఎన్టీయూ అధికారి


జేఎన్టీయూ-కే రెండు రోజుల క్రితం బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు నిర్వహించిన మేనేజీరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ (ఎమ్ఈఎఫ్ఏ) పరీక్ష ప్రశ్నాపత్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లతో ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో కాకినాడ జేఎన్ టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సుబ్బారావు స్పందించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పరీక్ష పత్రంలో ఇటువంటి ప్రశ్నలు అడగడం పొరపాటేనన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. అయితే, ఇదే విషయమై ఆ సబ్జెక్టు నిపుణులు వివరణ ఇస్తూ, పేపర్ లైవ్లీగా ఉంటుందని భావించి ఈ తరహా ప్రశ్నలు అడిగామని చెప్పారు. కాగా, ఎమ్ఈఎఫ్ఏ ప్రశ్నాపత్రంలో ‘లోకేష్ బ్యాంక్’, ‘హెరిటేజ్ లిమిటెడ్’, ‘బ్రాహ్మణి లిమిటెడ్’’ అనే ప్రశ్నలను సంధించారు.

  • Loading...

More Telugu News