: అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు వేగంగా జ‌ర‌గ‌ట్లేదంటూ అధికారులపై సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం


అమ‌రావ‌తిలోని త‌న కార్యాయంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు సీఆర్డీఏ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగంగా జ‌ర‌గ‌ట్లేదంటూ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిసెంబ‌రులోగా సీడ్ యాక్సిస్ రహ‌దారి పూర్తి కావాల్సి ఉంద‌ని గుర్తు చేశారు. భ‌వ‌నాల నిర్మాణ‌ ప‌నుల్లో అల‌సత్వం వ‌హిస్తూ మెల్లిగా కొన‌సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అనుకున్న స్థాయిలో నిర్మాణ‌ప‌నులు జ‌ర‌గ‌డం లేద అన్నారు. అసెంబ్లీ భ‌వ‌న నిర్మాణంపై ప‌లు సూచ‌న‌లు చేశారు. అమ‌రావ‌తిలో 7 ర‌హ‌దారుల‌కు త్వ‌ర‌లోనే టెండ‌ర్లు పిల‌వాల‌ని ఆదేశించారు.

  • Loading...

More Telugu News