: కరుణానిధి కుమారుడు స్టాలిన్ కు తప్పిన ప్రమాదం


డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత స్టాలిన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై నుంచి ధర్మపురికి వెళుతుండగా వెల్లూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పల్లికొండ టోల్ గేట్ వద్ద ఆయన కారు ఆగి ఉన్న సమయంలో మరో కారు స్టాలిన్ కారును ఢీ కొట్టింది. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది. ఈ ఘటనలో స్టాలిన్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. అయితే, ఈ ప్రమాదంలో స్టాలిన్ కు ఎలాంటి అపాయం కలగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే, కాన్వాయ్ లోని భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే మరో వాహనంలోకి ఎక్కించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News