: ఎస్ బీఐ ఫెస్టివల్ ఆఫర్... గృహరుణ వడ్డీ రేట్లు తగ్గింపు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ పేరుతో గృహ రుణాలపై వడ్డీ రేట్లను తాజాగా తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 9.1 శాతానికి దిగి వచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి. గత వారం ఎస్బీఐ బెంచ్ మార్క్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఫెస్టివల్ స్కీమ్ లో భాగంగా మహిళలు, లేదా మహిళలు కో బారోవర్లుగా తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రేటును బ్యాంకు బెంచ్ మార్క్ రేటు కంటే కేవలం 20 బేసిస్ పాయింట్లు అధికంగానే వసూలు చేయనున్నట్టు ఎస్ బీఐ తాజాగా ప్రకటించింది. అంటే వడ్డీ రేటు 9.1 శాతంగా ఉండనుంది. ఈ స్కీమ్ ఈనెల, వచ్చే నెల అమల్లో ఉంటుందని తెలిపింది.