: ఫిలిం ఫెస్టివల్ లో పాక్ సినిమాలకు నో ఎంట్రీ
గోవాలో త్వరలో జరగనున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పాకిస్థాన్ సినిమాలను నిషేధించారు. పాక్ నుంచి వచ్చిన రెండు ఎంట్రీలను తిరస్కరించారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా వెల్లడించారు. ఈ వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి. ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు గాను ప్రపంచ వ్యాప్తంగా 1032 ఎంట్రీలు వచ్చాయి. ఈ ఉత్సవాల సందర్భంగా, మొత్తం 88 థియేటర్లలో 194 సినిమాలను ప్రదర్శించనున్నారు.