: జయలలితకు చేతబడి చేశారా?.. లండన్ పత్రిక సంచలన కథనం!


అనారోగ్యంతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి రకరకాల వార్తలు వెల్లువెత్తాయి. తాజాగా ఓ ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. జయపై కొందరు చేతబడి చేశారని... అందువల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని లండన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు తమకు ఈ విషయాన్ని వెల్లడించాడని అందులో పేర్కొంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ చేతబడిని చేశారని తెలిపింది. డీఎంకేకు చెందిన వారు కానీ... లేదా అన్నాడీఎంకేలోనే జయ అంటే గిట్టని వారు కానీ ఈ పని చేసి ఉండవచ్చని పేర్కొంది. కరుణానిధి అనారోగ్యానికి కూడా తాంత్రిక శక్తులే కారణమై ఉండవచ్చని జ్యోతిష్కుడు అభిప్రాయపడ్డట్టు తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.

  • Loading...

More Telugu News