: ఐటీడీఏ పీవో వెంకట్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.20 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
శ్రీకాకుళం ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకట్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. అధికారులు ఇప్పటి వరకు రూ.20 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, విశాఖపట్నంలోని వెంకట్రావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వెంకట్రావు అక్రమాస్తులపై ఉప్పందుకున్న అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. అతడి ఇంట్లోంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాస్తులను చూసి నివ్వెరపోయారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల ఆస్తులను గుర్తించారు. మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.