: గడ్డాల్లో పెట్టిన పెన్ను కింద పడకూడదు.. పడిందా ఇక కొరడా దెబ్బలే!
పురుషులను వరుసగా నించోబెడతారు.. వారి పెరిగిన గడ్డాల్లో ఓ పెన్ను పెడతారు.. ఒకవేళ.. ఆ పెన్ను కిందపడిందా, ఇక అంతే.. కొరడాదెబ్బలు తప్పవు..! ఇరాక్ లోని ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ఒక ప్రాంతంలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటాయి. ఇరాకీ దళాల రాకతో విముక్తి చెందిన మోసూల్ ప్రాంతంలోని అనేక పట్టణాలు, గ్రామాలు విముక్తి పొందాయి. ఆయా ప్రాంతాలకు చెందిన వారు తమకు జరిగిన దారుణాల గురించి చెప్పారు. అక్కడి పౌరులను గడ్డాలు పెంచాలని ఐఎస్ ఆదేశించింది. కొన్ని రోజుల తర్వాత అక్కడి పౌరుల్లో కొందరిని నాలుగు రోడ్ల కూడలిలోకి తీసుకువచ్చారు. వారి గడ్డాల్లో పెన్ను పెట్టగా, కొందరి గడ్డాల్లో నుంచి అవి జారి కిందపడిపోయాయి. దీంతో, రెచ్చిపోయిన ఐఎస్ ఉగ్రవాది ఒకడు, గడ్డం సరిగ్గా పెంచడం లేదంటూ వీపు చిట్టిపోయేలా కొరడా దెబ్బలు కొట్టారంటూ బాధితులు వాపోయారు.