: మన 'సారే' కదా అనుకుంటే.. నేను కూడా షాక్ ఇవ్వాల్సి వస్తుంది: సీఎం చంద్రబాబు


తాత్కాలిక ప్రలోభాలకు లోనై లేనిపోని కష్టాలు తెచ్చుకుంటే మీ పదవి కూడా ఊడిపోతుందంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరిక చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, ‘నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవ తక్కువగా చేస్తే ప్రజలు నమ్మరు. ఎన్నికల్లో ఓట్లు పడకపోతే పార్టీ కూడా మిమ్మల్ని భరించలేదు. అందుకనే, నాయకులకు, కార్యకర్తలకు ఒక విషయం స్పష్టంగా మనవి చేస్తున్నాను.. ప్రజలకు మనం ఆదర్శంగా ఉండాలి. ఒక రాష్ట్రంలో, నియోజకవర్గంలో, ప్రాంతంలో తెలుగుదేశం నాయకుడిని స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి రావాలి తప్ప, వేలెత్తి చూపించే పరిస్థితి రాకూడదు. ఒకవేళ, వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే.. నేను కూడా నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ, ఫర్వాలేదులే మన సారే కదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం, నేను కూడా వారికి షాక్ ఇవ్వాల్సి వస్తుంది’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News