: అభిమాని ఏమన్నాడో అర్థంకాక తెల్లమొహం వేసిన జస్టిన్ బీబర్ !


ఇటీవల స్కాట్లాండ్ లో ఓ అభిమాని ఏం అడుగుతున్నాడో అర్థంకాక కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తెల్ల మొహం వేశాడు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉన్న బీబర్, అక్కడి ఒక ప్రాంతంలోని గోడపై ఎక్కి కూర్చున్నాడు. అదే సమయంలో, అటుగా వెళుతున్న కీత్ అనాండేల్ అనే అభిమాని అక్కడికి కారులో వచ్చాడు. వస్తూనే ‘ఎలా ఉన్నావ్?’ అంటూ ప్రశ్నించాడు. అయితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బదులు బీబర్ తెల్లమొహం వేశాడు. ఎందుకంటే, ఆ అభిమాని ప్రశ్నించింది, ఇంగ్లీషులో కాదు.. స్కాటిష్ భాషలో. దీంతో, జస్టిన్ బీబర్ సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయాడు. అయితే, ఇదంతా వీడియో తీసిన ఆ అభిమాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News