: ద్వారకా పీఠాధిపతిపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్.. సాయిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇంజెంక్షన్ ఆర్డర్ జారీ


షిర్డి సాయిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ద్వారక శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో దిల్ షుక్ నగర్ షిరిడి సాయి సంస్థాన్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు.. షిర్డి సాయిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇంజెంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. కాగా, షిర్డి సాయి భూతమని, దేవుడు కాదు కదా, కనీసం గురువు కూడా కాడని, షిర్డీకి వెళ్లడమంటే శ్మశానానికి వెళ్లి రావడమేనంటూ స్వరూపానంద చేసిన తీవ్ర వ్యాఖ్యలు విదితమే.

  • Loading...

More Telugu News