: ఇంగ్లిష్ రాక‌పోతే వ‌చ్చిన వారిని అడిగి తెలుసుకోండి: హోదా కోసం ప‌్ర‌భుత్వంపై చ‌ల‌సాని విమ‌ర్శ‌లు


ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ ప్ర‌భుత్వ నేత‌లు డ్రామాలాడుతున్నారని ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత చ‌లసాని శ్రీ‌నివాస్ విమర్శించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ కావాల్సిందేన‌ని అన్నారు. విభజన హామీల అమలుకే తాము పోరాడుతున్నామ‌ని చెప్పారు. నిజాయ‌తీ ఉంటే చ‌ర్చ‌కు రావాల‌ని ప్ర‌భుత్వానికి స‌వాలు విసిరారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏముందో ఇప్పుడు కొత్త‌గా ఏం ప్ర‌క‌టించారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇంగ్లిష్ రాక‌పోతే వ‌చ్చిన వారిని అడిగి తెలుసుకోండని సూచించారు. చిన్న చిన్న ప్రాంతాలకే ఐఐటీలు ఇచ్చారని, ఐదున్న‌ర కోట్ల జ‌నాభా ఉన్న రాష్ట్రానికి ఇవ్వ‌డం గొప్పా? అని ప్ర‌శ్నించారు. హోదా ఉద్యమం నిరంత‌రం కొన‌సాగుతోంది కాబ‌ట్టే కేంద్రం భ‌య‌ప‌డి ప్యాకేజీ అయినా ఇస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News