: యువరాజ్ సింగ్ కుటుంబంపై మళ్లీ ఆరోపణలు గుప్పించిన ఆకాంక్ష


యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ కి తానంటే భయమని యువీ సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. యువీ కుటుంబంపై గతంలో కూడా ఆరోపణలు గుప్పించిన ఆకాంక్ష, రెండేళ్ల క్రితం జొరావర్ ను పెళ్లి చేసుకుంది. మనస్పర్థల కారణంగా కేవలం నాలుగు నెలలకే విడిపోయారు. రియాల్టీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఆకాంక్ష పలు ఆరోపణలు చేసింది. జొరావర్ కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కేవలం యువీ తల్లి షబ్నం సింగ్ కారణంగా నాలుగు నెలలకే తాము విడిపోయామంది. విడాకులు ఇస్తే ఇస్తే తన జీవితాన్ని తాను చూసుకుంటానని చెప్పింది. తాను చెప్పిన విషయాలు వాస్తవాలు కాబట్టే షబ్నం భయపడుతోందని, అందుకే, ఆమె అంత తీవ్రంగా స్పందిస్తోందని ఆకాంక్ష అంది. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ నూ ఆమె వదిలిపెట్టలేదు. యువీ గంజాయి తాగేవాడంటూ ఆరోపించింది. ఇదిలా ఉండగా, ఆకాంక్ష చేసిన ఈ ఆరోపణలను షబ్నం సింగ్ ఒక ప్రకటనలో ఖండించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News