: గోదావరి తీరంలో దారుణం.. మహిళ మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు


పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగొండ మండలం నడిపూడిలో ఓ మహిళను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మృత‌దేహాన్ని గోదావరి తీరంలో పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఆ మ‌హిళ మృత‌దేహాన్ని కుక్కలు పీక్కుతింటూ క‌నిపించాయి. దీంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన‌ స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. మృతురాలు పెనుమంట్ర మండలం ఎస్‌.ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన మ‌హిళ‌గా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News