: హిల్లరీకి మరో కొత్త చిక్కు... ప్రతిష్టాత్మకమై ఫెడ్ డిబేట్ ప్రశ్నలు ఆమెకు ముందే తెలుసన్న వికీలీక్స్


మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు, ఈమెయిల్స్ వ్యవహారం ఇప్పటికే ముదురుతోంది. తాజాగా, మరో కొత్త చిక్కు ఆమెను చుట్టుముట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫెడ్ డిబేట్ ను భావిస్తారు. అయితే, ఈ డిబేట్ లో అడగబోయే ప్రశ్నలు హిల్లరీకి ముందే అందించారని వికీలీక్స్ తెలిపింది. వికీలీక్స్ పబ్లిష్ చేసిన క్లింటన్ ఈమెయిల్స్ ను బట్టి ఇది స్పష్టమవుతోంది. మార్చిలో ప్లింట్, మిచ్ లో జరిగిన సీఎన్ఎన్ డెమొక్రాటిక్ డిబేట్ ప్రశ్నలు, ఆ తర్వాత ఓహియో, కొలంబస్ సీఎన్ఎన్ టౌన్ హాల్ లో జరిగిన డిబేట్ ప్రశ్నలను హిల్లరీకి ముందే లీక్ చేసినట్టు తాజా ఈమెయిల్ వ్యవహారంలో తేలింది. అయితే ఈ డిబేట్ ను నిర్వహించిన సీఎన్ఎన్ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. ఇలా జరగడానికి అవకాశం లేదని వాదించింది. ఏదేమైనప్పటికీ, ఈ అంశం హిల్లరీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మైలేజీ పెంచేదే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News