: తెలుగుదేశమే అసలు సిసలైన తెలంగాణ పార్టీ.. స్పష్టం చేసిన రేవంత్
అసలు సిసలైన తెలంగాణ పార్టీ తెలుగుదేశమేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు ఇతర రాష్ట్రాల్లో పుట్టి తెలంగాణకు వచ్చిన పార్టీ తెలుగుదేశం కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ గడ్డపై పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ అధికారం పంచుకుంటున్న తెలంగాణ పార్టీ తెలుగుదేశమని ఆయన వివరించారు. ‘‘తెలంగాణ పార్టీ అని, తెలంగాణ వాదులమని చెప్పుకునే మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 20 మంది సీమాంధ్రులకు టికెట్లు ఇచ్చిన విషయం వాస్తవం కాదా?’’ అని టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. టీడీపీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయమని, అందుకే ప్రజలను మాయ చేసేందుకు ఆంధ్రా పార్టీ అని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.