: దీపావళి రోజున కోహ్లీ-అనుష్క జంటను చూసిన ఫ్యాన్స్


దీపావళి రోజున కోహ్లీ-అనుష్కను చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మ్యాచ్ లో భాగంగా ఎఫ్ సి గోవా, ఢిల్లీ డైనమోస్ టీమ్ ల మధ్య నిన్న గోవాలో మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడి స్టేడియానికి టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అనుష్క శర్మ వెళ్లారు. ఈ జంటను బిగ్ స్క్రీన్ పై చూసిన అభిమానులు సంతోషపడ్డారు. కాగా, ఎఫ్ సి గోవా ఫ్రాంచైజీకి కోహ్లీ కో-ఓనర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ టీమ్ ను వారు ఉత్సాహపరిచారు. అయితే, ఈ మ్యాచ్ లో 2-0 స్కోరుతో ఢిల్లీ డైనమోస్ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News