: పెళ్లిరోజు బహుమతి ఏమిస్తారని అడిగితే.. విడాకులు ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య


పెళ్లి రోజు బహుమతిగా ఏమిస్తారని గత ఏడాది అక్టోబర్ 31న ఇమ్రాన్ ను అడిగితే, చివరకు తనకు విడాకులు ఇచ్చారని పాకిస్థాన్ రాజకీయ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రీహమ్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ‘మా పెళ్లి రోజు సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31న ఏ బహుమతి ఇస్తారని అడిగాను. విడాకులు ఇచ్చారు’ అని పేర్కొంది. కాగా, టెలివిజన్ జర్నలిస్టు అయిన రీహమ్, ఇమ్రాన్ ఖాన్ ల వైవాహిక బంధం కొనసాగింది పది నెలల పాటే. గత ఏడాది అక్టోబరులో విడాకులు తీసుకున్నారు. అంతకుముందు, జమీమా గోల్డ్ స్మిత్ అనే ఇంగ్లీషు అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఇమ్రాన్, ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే నెల 2వ తేదీన ఇస్లామాబాద్ బంద్ కు ఇమ్రాన్ ఖాన్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఆయన మాజీ భార్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News