: ఓటుకు నోటు కేసు: హైకోర్టులో విచారణ.. చంద్రబాబు తరఫు వాదనలు విన్న న్యాయస్థానం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన అప్పీలు పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూధ్రా న్యాయస్థానానికి తమ వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. వచ్చే సోమవారం నాడు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.