: తహశీల్దార్ సంతకం ఫోర్జరీ.. 29 మంది రైతులపై కేసులు నమోదు
తహశీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి రుణాలు తీసుకున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో జరిగింది. సదరు తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన దుప్పెల్లికి చెందిన 29 మంది రైతులు వలిగొండ మండలంలోని అరూరు కెనరా బ్యాంకులో రుణం తీసుకున్నారు.