: ఆర్కే ఆచూకీ మాకూ తెలియజేయాలి.. ఏదో జరిగిందని అనిపిస్తోంది: హైకోర్టు
ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తోన్న ఆర్కే భార్య శిరీష ఈ రోజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టుకు ఆమె తన భర్తను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీంతో ఆర్కే ఆచూకీ తమకు తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్కే చనిపోయాడో పోలీసు కస్టడీలో ఉన్నాడో తెలపాలని ఆదేశించింది. ఏదో జరిగిందని తమకు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆర్కేకు ఎలాంటి హానీ తలపెట్టకూడదని చెప్పింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. మావోయిస్టులైనా, సామాన్యులైనా రక్షించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.