: అనుమానిత బంగ్లాదేశ్ వాసులు ఇద్దరు అరెస్ట్
అనుమానిత బంగ్లాదేశ్ వాసులు ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌని రైల్వేస్టేషనల్లో సంపర్క్ క్రాంతి రైల్లో వీరు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు వారిని ప్రశ్నించగా.. తాము మయన్మార్ లోని ఒక శరణార్థి క్యాంపు నుంచి తప్పించుకుని అగర్తాలకు వచ్చామని, జమ్మూకాశ్మీర్ కు వెళ్తున్నామని పేర్కొన్నారు. పాట్నా నుంచి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అనుమానితులిద్దరిని ప్రశ్నించనుందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.