: చిరంజీవి సినిమాతో ఎంట్రీ వెరీ లక్కీ అంటున్న హీరోయిన్ అంజలా ఝవేరీ భర్త


మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం తన అదృష్టమని బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా అన్నాడు. ఇంతకన్నా మంచి లాంచింగ్ తనకు దొరకదని తెలిపాడు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో తరుణ్ అరోరా విలన్ గా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ, ఇంతకన్నా మంచి అవకాశం తనకు లభించదని... ఐయాం వెరీ లక్కీ అని చెప్పాడు. డైరెక్టర్ వీవీ వినాయక్ తనను బాగా ప్రోత్సహిస్తున్నారని... అయన చెప్పినట్టుగానే చేసుకుపోతున్నానని తెలిపాడు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన తరుణ్ అరోరా... కోలీవుడ్ లో 'కనిదన్' అనే చిత్రంలో నటించాడు. చిరూ సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న తరుణ్ అరోరా ఎవరో కాదు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన నిన్నటి కథానాయిక అంజలా ఝవేరి భర్త. అయితే వీరిద్దరికీ చాలా ఏజ్ గ్యాప్ ఉంది. తరుణ్ వయసు 37 ఏళ్లు కాగా... అంజలా ఝవేరి వయసు 44 కావడం విశేషం.

  • Loading...

More Telugu News