: చెన్నైలో వేడివేడిగా పిల్లుల బిర్యానీ!


వింటేనే వాంతులు వచ్చే వార్త ఇది. తమిళనాడు రాజధాని చెన్నైలో పిల్లి మాంసంతో వండిన బిర్యానీని అమ్ముతున్నారు. దీనికోసం, పిల్లుల్ని పట్టుకొని చంపి, వాటితో బిర్యానీ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఎత్తుకొచ్చిన పిల్లులతో ఈ పని చేస్తున్నారు. ఇప్పటికే తమ పెంపుడు పిల్లులు కనిపించడం లేదంటూ చెన్నై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. నగరంలోని పల్లవరంలో జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ తో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ సందర్భంగా, బోనులో ఉంచిన పిల్లులను వారు విడిపించారు. అయితే, చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్తేమీ కాదని... పలు హోటళ్లలో ఈ భాగోతం ఎప్పుడో వెలుగుచూసిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే ఇది జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News