: తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 8 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసి జైలు నుంచి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత పరారయిన విషయం తెలిసిందే. వారి కోసం ముమ్మర గాలింపు జరిపిన పోలీసులు అన్ని ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి తక్కువ సమయంలోనే వారి ఆచూకీని కనిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ శివారులోని ఎన్‌కేడీలో జరిగిన ఎన్‌కౌంటర్లో వీరు మృతి చెందారు. కాల్పుల్లో ముజీబ్ షేక్, అబ్దుల్ మజీద్, మహ్మద్ ఖాలీద్ అహ్మద్, సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు హతమయ్యారు.