: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి నుంచి ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరభద్రసింగ్ వయసు 82 సంవత్సరాలు. 1934 జూన్ లో ఆయన జన్మించారు. 2012 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 1983 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2003 నుంచి 2007 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన... తాజాగా 2012 నుంచి కూడా సీఎంగా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు 1962, 1967, 1972, 1980, 2009లలో ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News