: బెంగళూరులోని నారాయణ స్కూల్ ను బెదిరించిన 20 మంది అరెస్ట్


తాము మానవ హక్కుల సంఘం ప్రతినిధులమని చెప్పుకుని బెంగళూరులోని జేపీనగర్, పుట్టెనహళ్ళి ప్రాంతంలో ఉన్న నారాయణ ఈ-టెక్నో స్కూలుకు వెళ్లి బెదిరింపులకు దిగి డబ్బు డిమాండ్ చేసిన 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాలకు వెళ్లిన వీరు ప్రిన్సిపాల్ బాలసావిత్రిని కలసి సీబీఎస్ఈ గుర్తింపు గురించి అడిగి, ఆపై డబ్బు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులుగా చెప్పుకుంటున్న వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరు మాత్రం స్కూల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే సీబీఎస్ఈ గుర్తింపును గురించి అడిగేందుకు వచ్చామని చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News