: వివాదాల నడుమ రిలీజై... భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది


'యే దిల్ హై ముష్కిల్'... ఈ బాలీవుడ్ సినిమా అసలు రిలీజ్ అవుతుందో, లేదో తెలియదు. ఉరీ ఉగ్రదాడి... ఈ సినిమాకు ఉరి తాడులా అవతరించిన నేపథ్యం. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను రిలీజ్ చేయనివ్వం అంటూ ఓ వైపు ఎమ్మెన్సెస్, మరోవైపు థియేటర్ యాజమాన్యాలు భీష్మించుకుని కూర్చున్నాయి. సినిమా రిలీజ్ కాకపోతే ఈ చిత్రానికి పనిచేసిన వందల మంది జీవితాలు రోడ్డున పడతాయంటూ దర్శకుడు కరణ్ జొహార్ అభ్యర్థన. అసలే కష్టాల్లో ఉన్నాను... ఈ సినిమా రిలీజ్ కాకపోతే నా కెరీరే నాశనమవుతుందంటూ యువ హీరో రణబీర్ కపూర్ ఆవేదన. ఇలాంటి, సంఘర్షణల మధ్య 'మహా' సీఎం ఫడ్నవిస్ చొరవతో ఈ సినిమా రిలీజైంది. ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ, రణబీర్ కపూర్ లు నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రెండు రోజుల్లో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 13.30 కోట్లు, రెండో రోజు రూ. 13.10 కోట్లు వసూళ్లతో... తొలి రెండు రోజుల్లోనే రూ. 26.40 కోట్లు కొల్లగొట్టింది. దీపావళి సందర్భంగా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ఈ సినిమా విడుదలైంది. కరణ్ సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News