: హైదరాబాదులో దీపావళి రాత్రి జోరు వాన!
దీపావళి పండగ రాత్రి టపాసులు పేలడానికి బదులు జోరున వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో టపాసులు కాల్చడానికి సిద్ధమైన పిల్లలు, యువత నిరుత్సాహపడ్డారు. ఈరోజు రాత్రి సుమారు 7.30 గంటల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. చక్కగా ముస్తాబైన మహిళలు తమ ఇంటి ముందు ప్రమిదలు పెట్టే సమయంలో ఊహించనని వర్షం కురవడం నిరుత్సాహపరిచింది.