: తెలుగు రాష్ట్రాల సీఎంలపై నమ్మకముంది: గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరిస్తారన్న నమ్మకం తనకు ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాదర్బార్ లో భాగంగా సాధారణ ప్రజలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, సమస్యలు లేకుండా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని తాను భగవంతుడ్ని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, గవర్నర్ కు ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు.