: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ‘విశాఖ’లో పోలీసుల విస్తృత తనిఖీలు


ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. నవంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, విశాఖ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. కాగా, విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. పాడేరులో అదనపు బలగాలను మోహరించారు.

  • Loading...

More Telugu News